బౌలర్ పెట్టిన బిక్షతో.. మ్యాచ్‌ను ముగించాడు?
స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం జరిగింది. స్కాట్లాండ్‌కు ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. అయితే మూడో బంతికి ఒక సంఘటన జరిగింది. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచేసాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన లీస్క్ వెంటనే వెనక్కి వెళ్ళాడు. అయితే మన్కడింగ్ మిస్ అయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఫోర్ తో స్కాట్లాండ్ మరిచిపోలేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ రన్ అవుట్ చేసి ఉంటే ఐర్లాండ్ గెలిచేదని, ఆ బౌలర్ పెట్టిన బిక్ష వల్లే స్కాట్లాండ్ గెలిచిందని కామెంట్లు పెడుతున్నారు.