
క్రికెట్‌లో వికెట్ తీస్తే.. ఎవరైనా ఇలా రివేంజ్ తీర్చుకుంటారా?
స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్ లో 14 ఏళ్ల బాలుడు, 17 బాలుడిరి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అవుట్ అయినా కూడా పిచ్ వదిలి వెళ్ళడానికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో తన్ని అవుట్ చేసిన బౌలర్ తో గొడవకి దిగాడు. మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో అవుట్ అయినా బాలుడికి తన తమ్ముడు కూడా తోడయ్యాడు. ఆ ఇద్దరు కలిసి అవుట్ చేసిన బాలుడిపై గొడవకి దిగారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా ఏకంగా గొంతు పిసికి గ్రౌండ్ లోనే చంపేశారు. బాలుడు చనిపోయాడని తెలియగానే అన్నతమ్ములు పారిపోయారు. వెంటనే మృతుడి మందువులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, బాలుడిని చంపిన ఇద్దరికి శిక్ష పడితేనే బాలుడికి అంత్యక్రియలు చేస్తామని, అంత వరకు పోస్ట్ మార్టానికి అనుమతించేది లేదని మృతుడి బంధువులు గొడవకి దిగారు. ఆ తరువాత అధికారులు వారి కుటుంబ సబ్యులకు వారిని శిక్షిస్తాం అని హామీ ఇవ్వడంతో బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.