రోడ్డు మీదే దుకాణం పెట్టేసారు.. రొమాన్స్ తో రెచ్చిపోయిన లవర్స్?
అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమయంలో ఇక అధికారులు స్పందిస్తూ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎవరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎందుకంటే ఇలా బైక్ పై వెళ్తూ ప్రియురాలితో రొమాన్స్ చేయడం ఒక కొత్త ట్రెండ్ అని భావిస్తున్నారో ఏమో ప్రతి ఒక్కరు ఇలాంటిది ట్రై చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. మరోసారి ఇద్దరు లవర్స్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయారు.
ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే యువకుడు బైక్ నడుపుతున్నాడు. అయితే అతని ప్రేయసి బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని యువకుడిని గట్టిగా కౌగిలించుకొని రొమాన్స్ చేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో హిందూపురం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.. అయితే ఇలా బైక్ పై లవర్స్ రొమాన్స్ తో రెచ్చిపోతున్న నేపథ్యంలో మిగతా వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ బైక్ వెనకాల కారులో వెళుతున్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అటు పోలీస్ శాఖ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది.