కోహ్లీ ఇచ్చిన సలహాతోనే రాణిస్తున్నా : ఆసిస్ క్రికెటర్

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్ళు ఎవరు అని చర్చ వచ్చినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరుమొదట వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే తన ఆట తీరుతో అంతలా ప్రపంచ క్రికెట్లో హవా నడిపించాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే సాధించి తనకు తిరుగులేదు అని నిరూపించాడు. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టినప్పటికీ ఇంకా క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగా పరుగులు చేయాలనే కసి విరాట్ కోహ్లీ లో కనిపిస్తూ ఉంటుంది.



 అంతేకాదు కోహ్లీలోని దూకుడు స్వభావం అటు అందరి క్రికెటర్లలో కెల్లా అతని ప్రత్యేకంగా నిలిపింది అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ క్రికెటర్ దగ్గర నుంచి ఎన్నో విలువైన సలహాలు తీసుకోవాలని ఎంతో మంది ఆటగాళ్లు ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. కోహ్లీ కూడా యువ ఆటగాళ్లతో ఇక తన అనుభవాలను పంచుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇక తనకు కూడా కోహ్లీ ఇచ్చిన సలహా బాగా ఉపయోగపడింది అంటూ చెబుతున్నాడు ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్. కోహ్లీ ఇచ్చిన సలహాలతోనే ప్రస్తుతం బాగా రాణించగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.



 మొన్నటికి మొన్న ఇండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో అటు రెండు ఇన్నింగ్స్లలో 44, 66 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఇక ఇప్పుడు యాషెష్ సిరీస్ లో కూడా రాణిస్తున్నాడు అలెక్స్ క్యారీ. అయితే కోహ్లీతో పాటు స్మిత్ ఇచ్చిన సలహాలతో బ్యాటింగ్లో రాణిస్తున్నట్లు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చెప్పుకొచ్చాడు. స్పిన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడొద్దని వాళ్ళు సూచించారు.. దీంతో రివర్స్ స్వీప్ ఆడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ తెలిపాడు. కాగా మొన్న డబ్ల్యూటీసి ఫైనల్ లో గెలుపొందిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో యాషెష్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: