జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా.. వరల్డ్ రికార్డ్?

praveen
వరల్డ్ క్రికెట్లో జింబాబ్వే ఒక పసికూనా టీం గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఆ టీంలోని ప్లేయర్స్ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయరు అని అందరూ భావించేవారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సికిందర్ రాజా అనే క్రికెటర్ గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో సృష్టించిన విధ్వంసం గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పాలి. అయితే ఇక తర్వాత కూడా అదే రీతిలో ఫామ్ ని కొనసాగిస్తూ అతను కూడా అందరిలాగానే ఒక స్టార్ క్రికెటర్ ని అన్న విషయం ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాడు.



 ఇక ఇప్పుడు హరారే లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో కూడా జింబాబ్వే ఆటగాడు సికిందర్ రాజా అదరగొట్టాడు. ఏకంగా మెరుపు సెంచరీ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  ఇటీవలే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో దుమ్ము దులిపాడు. ఏకంగా నెదర్లాండ్ బౌలర్స్ అందరికీ కూడా చుక్కలు చూపించాడు అని చెప్పాలి. సిక్సర్ల వర్షం కురిపించాడు. 54 బంతుల్లోనే 8 సిక్సర్లు  ఆరు ఫోర్ లతో  అజెయ సెంచరీ తో ఆకట్టుకున్నాడు సికిందర్ రాజా. ఈ క్రమంలోనే 40.5 ఓవర్లలోనే టార్గెట్ చేదించి జింబాబ్వే జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.



 అయితే 54 బంతుల్లోనే సెంచరీ చేసిన సికిందర్ రాజా.. వన్డే క్రికెట్ లో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. సీన్ విలియమ్స్ కేవలం 70 బంతుల్లోని సెంచరీ సాధించాడు. ఇప్పుడు సికిందర్ రాజా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ గా రానించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు సికిందర్ రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: