ఎల్లో జెర్సీ ధరించబోతున్న.. బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లేసెస్?
ఇక ఇలా చెన్నై అభిమానులు అందరినీ కూడా తన ఆటతీరుతో ఆకర్షించి అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే గత రెండు సీజన్ల నుంచి కూడా అటు ఫాబ్ డూప్లెసెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెగా వేలం సమయంలో డూప్లెసెస్ ని వేలంలోకి వదిలేసిన చెన్నై యాజమాన్యం.. మళ్లీ అతని దక్కించుకునేందుకు ప్రయత్నించిన అది కుదరలేదు. దీంతో బెంగళూరు జట్టులోకి వెళ్లి అక్కడ కెప్టెన్సీ అందుకొని జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అతన్ని చాలా మిస్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో బెంగళూరు కెప్టెన్ గా ఉన్న డూప్లెసెస్ మరోసారి ఎల్లో జెర్సీ ధరించబోతున్నాడు అని తెలుస్తుంది.
అదేంటి మళ్లీ చెన్నై జట్టులోకి రాబోతున్నాడా అని అనుకుంటున్నారు కదా.. నిజమే మరోసారి చెన్నై ఫ్రాంచైజీ తో జతకట్టబోతున్నాడు.. అమెరికాలో నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 లో ఐపీఎల్ ఆర్సిబి కెప్టెన్ కాస్త చెన్నై కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై తరపున అదరగొట్టిన డూప్లెసెస్ ఇక బెంగళూరు తరఫున ఈ ఏడాది ఏకంగా 730 పరుగులు చేసి సూపర్ ఫామ్ కనబరిచాడు. ఈ క్రమంలోనే చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన టెక్సాస్ టీం కి కూడా కెప్టెన్సీ వహించే ఛాన్స్ అందుకున్నాడు అన్నది తెలుస్తోంది.