టీమిండియా చేదించిన.. అత్యధిక లక్ష్యం ఎంతో తెలుసా?

praveen
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు భారీగా పరుగులు చేస్తున్న ఓవల్ మైదానంలో అటు భారత బ్యాట్స్మెన్లు మాత్రం పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో ముందుగా అందరూ ఊహించినట్లుగా ఆస్ట్రేలియాకు టీమిండియా గట్టి పోటీ ఇవ్వలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుందా లేదా అని అనుమానాలు కూడా కొంతమంది అభిమానుల్లో తలెత్తుతున్నాయి.

 అయితే అటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్ ముందు 44 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలోనే ఈ కొండంత టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి.. 164 పరుగులు చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంకా 280 పరుగులు చేదించాల్సి ఉంది. సాదరణంగా ఇక వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్లు జరుగుతుంటే.. గత గణాంకాలు ఏంటి అన్న విషయంపై కూడా అందరూ చర్చించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే భారత్ ముందు ఆస్ట్రేలియా 444 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో ఇక ఇప్పుడు వరకు భారత జట్టు టెస్ట్ ఫార్మాట్లో చేదించిన అత్యధిక లక్ష్యం ఏమిటి అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. 1976 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 406 పరుగుల టార్గెట్ ను చేదించింది టీమ్ ఇండియా జట్టు. టీమ్ ఇండియా ఛేదించిన అత్యధిక టార్గెట్ ఇదే కావడం గమనార్హం. ఇక ఎప్పుడూ ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 444 పరుగులు టార్గెట్ చేదించాల్సి ఉంది. ఐదో రోజు ఆటలో భాగంగా 280 పరుగులు చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ టార్గెట్ ను టీమిండియా ఛేదించింది అంటే వరల్డ్ క్రికెట్లో చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: