ఎంపైర్లు కళ్ళకు గంతులు కట్టుకున్నారా.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్?

praveen
సాదరణంగా క్రికెట్లో  అంపైర్లు ప్రతి బంతిని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి. అంతేకాదు సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ఇక అంపైర్లు ఒకవేళ ఏదైనా నిర్ణయం ప్రకటించే విషయంలో కన్ఫ్యూజన్లో ఉంటే వెంటనే దానిని థర్డ్ అంపైర్ కి రిఫర్ చేయడం చేస్తూ ఉన్నారు. అయితే థర్డ్ అంపైర్ టెక్నాలజీ ఆధారంగా క్షుణ్ణంగా బంతిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించడం.. ఇక క్రికెట్లో చూస్తూ ఉన్నాము.. కానీ ఇటీవల కాలంలో ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా కూడా కొంతమంది థర్డ్ ఎంపైర్లు  తెలిసి తప్పు చేస్తున్నారేమో అనే విధంగా ఇక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉండడం అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇలా థర్డ్ అంపైర్లు ఎవరైనా తప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తే వారిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా భారత బ్యాట్స్మెన్ గిల్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడు అంటూ ఇక భారత జట్టు అభిమానులు అందరూ కూడా తిట్టిపోస్తూ ఉన్నారు. గిల్ ఆడిన బంతిని కామరూన్ గ్రీన్ క్యాచ్ పట్టెందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.


 ఈ క్యాచ్ వ్యవహారం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అంపైర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంపైర్లు తీసుకున్న  నిర్ణయాన్ని తప్పుపట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. అవుట్ అయిన క్యాచ్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎంపైర్లు కళ్ళకి గంతులు కట్టుకున్నారేమో.. ఇలా ఒక నిర్ణయం విషయంలో సందేహాస్పదంగా ఉన్నప్పుడు అది నాట్ అవుట్ అవుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: