ఐపీఎల్ : సన్రైజర్స్ ఓడింది.. కానీ అతను మనసు గెలిచేసాడు?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తగా కెప్టెన్సీని మార్కరమ్ కు అప్పగించినప్పటికీ జట్టు ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరికి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే చాన్సులను కూడా కోల్పోయింది అని చెప్పాలి. అయితే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన కూడా ఆ జట్టు స్వేచ్ఛగా ఆడటం లేదు.


 ప్రత్యర్థి టీం కి కనీస పోటీ ఇవ్వలేక చివరికి దారుణంగా ఓటమి చవిచూస్తూనే ఉంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం సన్రైజర్స్ ఇలాగే చెత్త ప్రదర్శన చేసి ఓటమి చవిచూసింది. అయితే ఎంతో దూకుడు మీద ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో  బౌలర్లు కీలక పాత్ర వహించినప్పటికీ అటు బ్యాటింగ్లో మాత్రం సాధారణ టార్గెట్ ను సైతం సన్రైజర్స్ ఛేదించలేకపోయింది అని చెప్పాలి. చివరికి సన్రైజర్స్ కి మరో ఓటమి తప్పలేదు. అయితే ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోయినప్పటికీ అటు భువనేశ్వర్ కుమార్ మాత్రం అదిరిపోయే హ్యాట్రిక్ సాధించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.



 గుజరాత్ తో మ్యాచ్లో చివరి ఓవర్లో సన్రైజర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. చివరి ఓవర్లో రన్ అవుట్ తో పాటు భువనేశ్వర్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో 200 పరుగులు దాటుతుంది అనుకున్న గుజరాత్ టైటాన్స్ స్కోరు.. 188 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే భువనేశ్వర్ కుమార్ ఇలా జట్టును గెలిపించేందుకు ఎంతల పోరాడినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ విభాగం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో చివరికి ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: