ఉమ్రాన్ ను.. సన్రైజర్స్ సరిగ్గా వాడుకోవట్లేదు : ఇర్ఫాన్ పఠాన్

praveen
భారత క్రికెట్లో అత్యంత వేగంతో బంతులు విసరే ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే.. ప్రతి ఒక్కరికి కూడా కాశ్మీరీ బౌలర్ ఇమ్రాన్ మాలిక్ గుర్తుకు వస్తాడు. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్కు సాధ్యం కాని రీతిలో గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసిరి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి మొదటి సీజన్ లోనే తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఏకంగా మెరుపు లాంటి వేగంతో బంతులను విసిరి వికెట్లను సైతం విరగొట్టి సెలెక్టర్ల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్.


 ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు అని చెప్పాలి.  టీమిండియాలో అయితే చోటు దక్కింది కానీ ఇక ఫాస్ట్ బౌలింగ్ తో అతను నిరూపించుకోలేకపోయాడు. అతని బౌలింగ్లో వేగం ఉన్న వైవిధ్యం లేకపోవడంతో ఇక బ్యాట్స్మెన్లు భారీగా పరుగులు చేసేవారు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఇక ఇప్పుడు సన్రైజర్స్ జట్టు తరపున ఆడుతూ మెరుగ్గానే రాణిస్తూ ఉన్నాడు. కానీ కొన్ని మ్యాచ్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడంతో సన్రైజర్స్ యాజమాన్యం అతన్ని పక్కన పెట్టేసింది.  ప్లేయింగ్  ఎలెవన్ జట్టులో చోటు కల్పించలేదు.



 ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లీగ్ లోనే ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతున్న ఉమ్రాన్ మాలిక్ ను ఆడించకుండా ఎందుకు బయట కూర్చోబెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్ మాలిక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: