లక్నో టీం పై.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఇకపోతే టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇలా ఎప్పుడు తన రివ్యూలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటారు. ఇక ఆయా జట్ల ప్రదర్శనలు పై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే లక్నోజట్టు విషయంలో కూడా వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన రివ్యూ ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కేఎల్ రాహుల్ సారధ్యంలో బరిలోకి దిగిన లక్నో టీం.. ఈ ఏడాది పడుతూ లేస్తూనే ప్రయాణం సాగిస్తుంది. ఇక మధ్యలో గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు.
దీంతో ప్రస్తుతం కృణాల్ పాండ్యా లక్నో జట్టు సారాధ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు ఆరు విజయాలు సాధించి ఇక 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇకపోతే లక్నో జట్టు ఆట తీరు గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ సీజన్లో మోస్ట్ బ్యాలెన్స్ జట్టు లక్నో అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవలే ఒక క్రీడా చానల్ తో మాట్లాడుతూ.. లక్నో జట్టు బయట గ్రౌండ్లలో అద్భుతంగా రాణిస్తుంది. కానీ సొంత మైదానాలలో మాత్రం కాస్త నిరుత్సాహపరిస్తుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.