అతని బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం : గంగూలీ
కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఇందుకు భిన్నంగా కెరియర్ ముగిసిపోయింది అని అందరూ భావిస్తున్న సీనియర్ క్రికెటర్లదే ఎక్కువగా హవా నడుస్తుంది. తక్కువ ధరతోనే ఐపీఎల్లోకి వచ్చి కొన్ని జట్ల తరపున ప్రాతినిధ్యం ఆశిస్తున్న ఆటగాళ్లు.. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్గా సీనియర్ క్రికెటర్ గా ముద్రపడిన అజంక్య రహనే చెన్నై జట్టు తరఫున ఆడుతున్న మెరుపు ఇన్నింగ్స్ లను చూసి ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు అజంక్య రహనే.
ఇకపోతే ఇలా తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరిస్తున్న అజింక్య రహనే పెర్ఫార్మన్స్ గురించి మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రహనే బ్యాటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. డబ్ల్యుటిసి ఫైనల్లో రహానే గొప్పగా రాణిస్తాడు అని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో దేశం తరఫున ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడని గుర్తు చేశాడు సౌరబ్ గంగూలీ. తుది జట్టులో ఛాన్స్ దక్కితే అతను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు సౌరబ్ గంగూలీ . కాక ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేయడంతో డబ్ల్యూటీసి ఫైనల్ కోసం రహానేను ఎంపిక చేసింది బీసీసీఐ.