కోటి పోతేనేమి.. 8 రేట్లు ఎక్కువ సంపాదించాడుగా?
ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీకి ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులను ఉద్దేశిస్తూ లక్నో మెంటల్ గౌతమ్ గంభీర్ చేసిన చర్యలకు కౌంటర్ గా.. ఇటీవలే లక్నోతో మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ కవ్వింపులకు దిగాడు. దీంతో ఇక మ్యాచ్ చివర్లో అటు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ ఒకరిని ఒకరు కొట్టుకుంటారేమో అనంతగా గొడవపడ్డారు అని చెప్పాలి. దీంతో ఇక వీరి ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన రిఫరీ మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇక ఇలా మ్యాచ్ ఫీజులో 100% కోత కారణంగా కోటి రూపాయలు పోయినప్పటికీ విరాట్ కోహ్లీకి కొన్ని గంటల్లోనే 8 రేట్లకు పైగా డబ్బులు ఎక్కువగా తిరిగి వచ్చాయి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎలా అంటే.. సాధారణంగా కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు 8.9 కోట్లు తీసుకునే కోహ్లీ నిన్న తాను నటించిన గ్రేట్ లెర్నింగ్ యాడ్ ను పోస్ట్ చేశారు. దీంతో కోహ్లీ ఖాతాలో 8.9 కోట్లు వచ్చాయ్. ఈ విషయం తెలిసిన అభిమానులు కోటి పోతే దానికి ఎనిమిది రేట్లు వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు.