కోట్లు పెంటి కొంటే.. ఆడింది ఓకే మ్యాచ్.. ఇప్పుడు మళ్లీ?
ఇప్పటివరకు ఐపీఎల్ లోని అన్ని జట్లను కూడా ఇలా గాయాల బెడద వేధిస్తూనే ఉంది. కోట్ల రూపాయలు కుమ్మరించి జట్టును విజయవంతంలో నడిపిస్తారు అని నమ్మకం పెట్టుకుని కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయం బారిన పడుతూ చివరికి ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో జట్టు వ్యూహాల మొత్తం తారుమారు అయిపోతున్నాయని చెప్పాలి. ఇలా వరుసగా గాయలతో స్టార్ ప్లేయర్లను దూరం చేసుకుంటున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పాలి.
ఇప్పటికే ఆ జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆటగాళ్లు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇక ఇప్పుడు కోల్కతా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న లిటన్ దాస్ సైతం స్వదేశానికి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి సీరియస్గా ఉండటంతో ఇక ఐపీఎల్ నుంచి తప్పుకొని హుటాహుటిన బంగ్లాదేశ్ కు వెళ్ళాడు. అయితే ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు లిటన్ దాస్. అయితే మొదటి మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అని చెప్పాలి. ఇలా కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి మళ్లీ స్వదేశం వెళ్లిపోయాడు. అయితే ఐపీఎల్ ప్రారంభం సమయంలో స్టార్ ప్లేయర్ షకిబ్ ఉల్ హసన్ దూరం కావడంతో అతని స్థానంలో జేసన్ రాయ్ ని జట్టులోకి తీసుకుంది కోల్కతా జట్టు యాజమాన్యం.