లక్నో స్కోర్ 257/5.. ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ ఎంతంటే?
ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 257 పరుగులు చేసింది లక్నో జట్టు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇక ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరీలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 56 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఇదిలా ఉంటే ఇక లక్నో జట్టు 257/5 స్కోర్ నమోదు చేసిన నేపథ్యంలో ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నమోదైన భారీ స్కోర్ ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆ వివరాలు చూసుకుంటే.. 2013లో పూణే జట్టుపై ఆర్సీబీ చేసిన 263/5 పరుగులు ఇప్పటివరకు ఐపీఎల్లో టాప్ హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతుంది. తర్వాత ఇటీవల పంజాబీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో చేసిన 257/5 టాప్ స్కోరుగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తర్వాత 2016లో రాజస్థాన్ పై చెన్నై 248 /3, 2018లో కోల్కతా పంజాబ్ పై 245/6, 2008లో పంజాబ్ పై చెన్నై 240/5, 2023లో కోల్కతా పై చెన్నై 235 / 4, 2021 లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 235 / 9 హైయెస్ట్ స్కోర్లుగా కొనసాగుతున్నాయి. మరి లక్నో చేసిన హైయెస్ట్ పరుగుల రికార్డును ఈ ఏడాది ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి మరి.