కెరియర్ చివరి దశలో ఉన్నాను.. ధోని కీలక వ్యాఖ్యలు?
అయితే ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫిట్నెస్ దృశ్య అతను ఇంకా రెండు మూడు ఐపిఎల్ సీజన్లు ఆడుతాడని.. సహచర ఆటగాళ్లు.. ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. దీంతో ధోని మనసులో ఏముందో తెలియక అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోయారు. ఇప్పటికే పలుమార్లు రిటైర్మెంట్ ల పేరుతో అభిమానులకు ట్విస్ట్ ఇచ్చాడు ధోని.
ఇక ఇప్పుడు ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఎప్పుడు ట్విస్ట్ ఇస్తాడేమో అని భయపడిపోతున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మహేంద్ర సింగ్ ధోని తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఏం చెప్పినా ఏం చేసినా.. ఇది నా కెరియర్ చివరి దశ.. ప్రతి మ్యాచ్ ని కూడా ఎంతగానో ఆస్వాదిస్తున్నాను అంటూ ధోని చెప్పుకొచ్చాడు. తాను చెన్నై టీం తో ఉండడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపించారు అంటూ ధోని తెలిపాడు. ఈ సీజన్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బాధ లేదు. మా జట్టు బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.