ఐపీఎల్ : అరెరే.. సొంత గడ్డపై ఇబ్బంది పడుతున్నారే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక జట్టుపై మరో జట్టు ఆధిపత్యాన్ని  చెలాయించడం కాదు. ఏకంగా చివరి బంతి వరకు ఎవరు విజేతగా నిలుస్తారో తెలియని విధంగా ఉత్కంఠ కొనసాగుతుంది మ్యాచ్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లను చూస్తూ అటు ప్రేక్షకులు కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇక ప్రతి జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా ఐపీఎల్ లో హోమ్ గ్రౌండ్ లో ఏదైనా జట్టు మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇక ఆ జట్టు తప్పనిసరిగా విజయం సాధించడం ఖాయమని ప్రేక్షకులు బలంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో  పరిస్థితులు ఆ జట్టుకు కలిసి వస్తూ ఉంటాయి. ఇక మరోవైపు ప్రేక్షకులమద్దతు కూడా హోమ్ గ్రౌండ్ లో ఎక్కువగానే ఉంటుంది. దీంతో ప్రత్యర్థి ఎవరైనా సరే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న జట్టుదే విజయం అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు.


 కానీ 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం అందరి అంచనాలు తారుమారవుతున్నాయి. హోమ్ గ్రౌండ్ కాని మైదానాల్లో అదరగొడుతున్న జట్లు హోమ్ గ్రౌండ్ లో మాత్రం గెలుపు కోసం తెగ ఇబ్బంది పడుతున్నాయి. వరుసగా నాలుగు టీమ్స్ వారి హోమ్ గ్రౌండ్ లోనే ఓడిపోవడం ఫాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్.. బెంగళూరులో ఆర్సిబి.. హైదరాబాదులో సన్రైజర్స్.. చపాక్ లో చెన్నై.. జైపూర్ లో రాజస్థాన్.. ఇటీవల మోహాలిలో పంజాబ్ కింగ్స్  జట్లు వరుసగా ఓడిపోయాయి. దీంతో హోమ్ గ్రౌండ్ లో ఆడిన జట్టు విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానాలు ప్రస్తుతం ప్రేక్షకుల్లో నిండిపోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: