
ఐపీఎల్ : సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అర్జున్?
రెండు మ్యాచ్లలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు అర్జున్ టెండూల్కర్ ప్రతిభ గురించి తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా ఇక ఇప్పుడు అతని బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడింది కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే అయినప్పటికీ ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టేసాడు అర్జున్. అదేంటి రెండు మ్యాచ్ లలోనే సచిన్ రికార్డును ఎలా బద్దలు కొడతాడు అని షాక్ అవుతున్నారు కదా.
ఆ వివరాలు ఏంటో చూసుకుందాం.. 2009 ఐపిఎల్ సీజన్లో 6 ఓవర్లు వేసిన సచిన్ టెండూల్కర్ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి. అయితే అర్జున్ టెండూల్కర్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీసి అటు తండ్రి రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా కోల్కతా పై ముంబై ఇండియన్స్ తరఫున తొలి ఓవర్ వేసిన సచిన్ టెండూల్కర్ ఐదు పరుగులు ఇవ్వగా.. ఇక ఇటీవల అర్జున్ టెండూల్కర్ కోల్కతా పై వేసిన తొలి ఓవర్ లో కూడా ఐదు పరుగులే ఇవ్వడం విశేషం. ఇక రాబోయే మ్యాచ్లలో సచిన్ తనయుడు మరింత అద్భుతంగా రాణించాలని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.