అలా అయితే ధోనిపై నిషేధం పడుతుంది : సెహ్వాగ్
అందుకే ఒక్కసారి ఇలాంటి తప్పు చేసిన జట్టు మరోసారి ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు కాకుండా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక ఇప్పుడు ధోనీకి ఇలాంటి ప్రమాదమే ఉందని.. అప్రమత్తం కాకపోతే ఏకంగా ధోనిపై నిషేధం పడుతుంది అంటూ మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు నోబాల్స్ వైడ్లు వేయడం తగ్గించుకోవాలి అంటూ సూచించాడు. ఇలా నోబాల్స్ వైడ్ల రూపంలో ఎక్స్ ట్రా బాల్స్ వేయడం స్లో ఓవర్ రేట్ కి కారణం అవుతుంది అంటూ తెలిపాడు.
ఇది ఇలాగే కొనసాగితే కెప్టెన్ ధోనిపై నిషేధం పడే ఛాన్స్ కూడా ఉంది అంటూ అంచనా వేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ధోని అస్సలు హ్యాపీగా లేడు. నో బాల్స్ వైడ్ల రూపంలో వచ్చే ఎక్స్ ట్రా లు తగ్గించుకోవాలి అంటూ బౌలర్లకు ఇప్పటికే సూచించాడు. కానీ వారు తీరు మార్చుకోకపోతే మాత్రం ధోనీ లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవల కాలంలో అటు చెన్నై బౌలర్లు నోబాల్స్ వైడ్ల రూపంలోనే ఎక్కువ పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం.