ఐపీఎల్ : ఏంటి బ్రో.. ఇంత మార్పు వచ్చింది?

praveen
భారత జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లలో అజీంక్యా రహానే కూడా ఒకడు అని చెప్పాలి. అయితే టాలెంట్ ఉన్నప్పటికీ ఇతనికి అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కాయి. దానికి తోడు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అని ఒక ముద్ర పడిపోవడంతో ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అతను దూరం అయిపోయాడు అని చెప్పాలి. ఎప్పుడైనా కనిపిస్తే కేవలం టీమిండియా తరపున టెస్ట్ ఫార్మాట్లో తప్ప ఇక టి20 ఫార్మాట్ లో కనిపించింది చాలా తక్కువ. ఇక వన్డే ఫార్మట్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు.

 అలాంటి సీనియర్ అజింక్య రహానే కెరియర్ ముగిసిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే బీసీసీఐ సెలెక్టర్లు ఎన్ని మ్యాచ్లు ఆడిన జట్టు ఎంపికలో మాత్రం అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక  రహానే కెరియర్ ముగిసిందని ఎంతోమంది భావించారు. కానీ తన కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా అలాగే ఉంది అంటూ అజింక్య రహనే 2023 ఐపీఎల్ సీజన్లో నిరూపిస్తున్నాడు. అన్ని ఫ్రాంచైజీలు మాకు వద్దు బాబోయ్ అంటూ వదులుకుంటే అటు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 50 లక్షలకు రహనేను జట్టులోకి తీసుకుంది.

 ఇప్పుడు 50 లక్షలు కాదు అతనికి కోట్లు పెట్టిన తక్కువేనేమో అనేట్లుగా అతని ఆటతీరు కొనసాగుతోంది.అందరికీ తెలిసిన రహనేలాగా కాదు తనలో ఉన్న కొత్త ఆటగాడిని బయటపెడుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా బెన్ స్టోక్స్ లాంటి స్టార్ హిట్టర్ ను పక్కనపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ రహానే తో బరిలోకి దిగితే 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి అదరగొట్టాడు. రాజస్థాన్ తో మ్యాచ్లో 19 బంతుల్లో 31 బెంగుళూరు జట్టుతో మ్యాచ్లో 20 బంతుల్లో 37 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: