వరల్డ్ కప్ కోసం.. క్రికెట్ స్టేడియాల మరమ్మతుకు 502 కోట్లు?
ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ ను ఎంతో సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు బీసీసీఐ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. అయితే వరల్డ్ కప్ ను భారత్ లో ఉన్న 12 వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ 12 వేదికలలో ఉన్న మైదానాలలో ఇక అధునాతనమైన సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక స్టేడియంలో మరమ్మతుల కోసం ఏకంగా 502 కోట్ల రూపాయలను బీసీసీఐ కేటాయించిందట.
అయితే 502 కోట్ల రూపాయలతో అటు ఐదు స్టేడియాల మరమ్మత్తులు చేయబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇందులో ఈడెన్ గార్డెన్ కు 127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియం కు 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కు 117.17 కోట్లు.. మొహాలి స్టేడియం కు 79.46 కోట్లు, ముంబైలోని వాంఖడే స్టేడియం కు 78.48 కోట్ల రూపాయలను అటు బీసీసీఐ కేటాయించింది అన్నది తెలుస్తుంది. ఇక ఈ భారీ నిధులతో అటు ఆయా స్టేడియాలు అధునాతన హంగులతో ముస్తాబు కాబోతున్నాయ్ అని చెప్పాలి.