కనీసం నా కొడుక్కి బ్యాట్ కూడా కొనివ్వలేదు : రింకు సింగ్ తండ్రి
ముచ్చటగా బ్యాట్ కు పని చెప్తూ సిక్స్ లు బాడుతుంటే కన్నార్పకుండా అందరు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక రింకు సింగ్ తండ్రి తన కొడుకు ఆడిన విధానం గురించి ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అంతే కాదు రింకు చిన్నతనం నుంచి తాను ఏమి చేయలేదని, క్రికెట్ తిండి పెట్టాడు చదువు మీద ద్రుష్టి పెట్టు అని చెప్పేవాడినని, కానీ రింకు నా మాట వినకుండా ఆట మీద మాత్రమే ద్రుష్టి పెట్టాడు అని, చివరికి అతడి కోసం నేను ఒక బ్యాట్ ని కూడా కొనివ్వలేదు అని, అన్ని తనకు తానుగా కష్టపడి సమకూర్చుకున్నాడని తన ఆనందాన్ని మీడియా తో పంచుకున్నాడు.
ఇక చాల మంది నా కొడుకు ఆట బాగుంది అని చెప్తే అప్పుడు నేను ఆట ఆడాలనుకుంటే సరిగ్గా ఆడు అని మాత్రమే చెప్పానని ఎమోషనల్ అయ్యాడు. ఇక నా కొడుకు భవిష్యత్తు గురించి మేము చాల కలలు కంటున్నాం అని, కోల్కతా కోసం రింకు చక్కగా ఆడిన తీరు సంతోషాన్ని ఇచ్చిందని, ఎదో ఒక రోజు టీమ్ ఇండియా కు ఆడితే చూడాలని ఉందని రింకు తండ్రి ఖన్ చాంద్ చెప్పుకోచ్చారు.