మెరుపు ఇన్నింగ్స్ తో.. రహానే అరుదైన రికార్డ్?
ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు విధించిన 158 పరుగుల లక్ష్యం అజింక్య రహనే మెరుపు ఇన్నింగ్స్ ముందు మాత్రం ఎంతో చిన్నదిగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడు ప్రేక్షకులు చూడలేనట్లుగా రెచ్చిపోయిన రహానే సిక్సర్లు ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు అని చెప్పాలి. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఇక వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి.
అయితే ఇలా ఆరంభంలోనే అటు చెన్నై సూపర్ కింగ్స్ కి అజింక్య రహానే మంచి స్కోర్ అందించడంతో రహనే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎంతో అలవోకగా టార్గెట్ చేదించే వైపుగా జట్టును నడిపించారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా మెరుపు ఇన్నింగ్స్ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా సాధించాడు రహనే. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని పక్కన పెట్టి మరి అవకాశం ఇవ్వగా.. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 23 పరుగులు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. అదే సమయంలో ఐపీఎల్లో ఫాస్ట్టెట్ హాఫ్ సెంచరీ 19 బంతుల్లో సాధించి రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇక అతని తర్వాత శార్దూల్, బట్లర్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించారు.