సన్రైజర్స్ తో మ్యాచ్ కు ముందు.. పంజాబ్ కి గుడ్ న్యూస్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొన్ని జట్లను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. గాయం బారిన పడిన ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. అదే సమయంలో మరికొన్ని జట్లకు ఊహించని రీతిలో గుడ్ న్యూస్ అందుతుంది. ఎందుకంటే గాయం బారిన పడి కోలుకుంటున్న ఆటగాళ్లు ఆయా జట్లతో చేరిపోవడం జరుగుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఐపిఎల్ లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ కి ఇలాంటి ఒక శుభవార్త అందింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయినా కగిసో రబడా భారత్కు వచ్చేసాడు.

 పంజాబ్ జట్టులో చేరిపోయాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ధావన్ సేనతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు కగిసో రబడ . ఏప్రిల్ 9వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించి మరో అప్డేట్ కూడా వచ్చింది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ రాక కోసం మరికొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదట. ప్రస్తుతం లివింగ్ స్టోన్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు అన్నది తెలుస్తుంది.

 ఈ క్రమంలోనే లివింగ్ స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే ఇక భారత్కు వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు కగిసో రబడ  లాంటి స్టార్ బౌలర్ రాకతో మరింత పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఏడు పరుగులు తేడాతో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇక రెండో మ్యాచ్లో ఆ రాజస్థాన్పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: