చరిత్ర సృష్టించిన ధావన్.. ఇండియా తరఫున ఒకే ఒక్కడు?

praveen
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరియర్ గత కొంతకాలం నుంచి కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. జట్టులో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోవడంతో ఈ సీనియర్ క్రికెటర్ ని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. ఇక ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో కూడా అతని సెలెక్ట్ చేస్తారా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు శిఖర్ ధావన్.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో మళ్ళీ తన మునుపటి ఫామ్ నిరూపించుకుని వింటేజ్ శిఖర్ ధావన్ ను అందరికీ పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు అతను ముందే చెప్పేశాడు. ఇక చెప్పినట్లుగానే ఇక ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ మరోసారి వింటేజ్ దావన్  ను గుర్తు చేశాడు అని చెప్పాలి. 56 బంతుల్లో 9 ఫోర్లు మూడు సిక్సర్ల  సహాయంతో 86 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.



 ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ దవన్ అరుదైన రికార్డులు సాధించాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే సాధించిన 86 పరుగుల ద్వారా తన ఐపిఎల్ కెరియర్ లో 50వ అర్థ సెంచరీ సాధించాడు శిఖర్ ధావన్. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన ప్లేయర్గా రెండవ స్థానంలో నిలిచాడు. ఇక అంతే కాదు మొదటి ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలిచాడు అని చెప్పాలి. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ 54 అర్ధ సెంచరీలతో మొదటి స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. తర్వాత విరాట్ కోహ్లీ 45 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుపై శిఖర్ ధావన్ కు ఇది ఏడవ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: