రెండు భారీ సిక్సర్లతో.. ధోని అరుదైన రికార్డు?
దీంతో మొదటి మ్యాచ్ లోనే ఇలాంటి పరాభవమా అని అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కానీ ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి. బ్యాట్స్మెన్లు చెలరేగి పోవడంతో నిర్ణీత 217 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని వరుసగా రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టి అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగించాడు. ఇలా ధోని వరుసగా రెండు సిక్సర్లు కొట్టాక అభిమానులు అది చూసి ఆనందోత్సాహంలో చిందులు వేశారు అనడంలోనూ అతిశయోక్తి లేదు.
ఇక ఆ తర్వాత బంతికి మరో సిక్సర్ కొట్టబోయిన మహేంద్ర సింగ్ ధోని చివరికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇక ఇలా లక్నోతో జరిగిన మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా నిలిచాడు. ఇక ఇప్పటికే ధోని కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, ఏబి డివిలియర్స్ ఈ లిస్టులో ఉన్నారు. కానీ ధోని లాగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి 5000 పరుగులు సాధించింది మాత్రం ధోని ఒక్కడే అని చెప్పాలి.