ఇంత చూసి కూడా.. బీసీసీఐ మనసు కరగడం లేదా?

praveen
ఎవరిలోనైనా ఎంత టాలెంట్ ఉంది అనే విషయం తెలియాలంటే అవకాశం వస్తే తప్ప బయటపడదు కానీ అలాంటి అవకాశం రావాలంటే అది మామూలు విషయం కాదు ఐపీఎల్ సీజన్స్ ద్వారా వెలుగులోకి ఎంతోమంది ఆణిముత్యాలు బయటకు వచ్చారు. భారత జట్టులో స్థానం కోసం చాలామంది ఆటగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అందరికీ అవకాశం దక్కదు అలాంటి వారి కోసం ఐపీఎల్ బలంగా కనిపిస్తోంది తాజాగా ఐపీఎల్ నుంచి వచ్చిన మరొక ఆణిముత్యం సంజు సాంశన్. సంజు ఐపిఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. అతని ఆట తీరు చూసిన వారు ఎవరైనా కూడా ఎందుకు భారత జట్టులో స్థానం సంపాదించలేకపోతున్నాడు అనే అనుమానం వ్యక్తం చేస్తారు.
వరుసగా భారత జట్టులో విఫలమవుతున్న వారి స్థానంలో సంజు లాంటి ఆటగాళ్లకు స్థానం ఇవ్వాలని సోషల్ మీడియాలో ఒక హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
జస్టిస్ ఫర్ సంజు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పట్ల పలువురు స్పందిస్తున్నారు. ఐపీఎల్ లో సంజు ఆట చూసైనా అతడు ఆడుతున్న ఇన్నింగ్స్ ను చూసైనా అతడికి అవకాశం కల్పించాలని అనిపించడం లేదా? ఎవరి మనసు కరగడం లేదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్. ఏదో ఒక విధంగా భారత జట్టులో స్థానం సంపాదించిన తుది జట్టుకు సంజు లాంటి ఆటగాళ్లు ఎంపిక ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది.  భారత జట్టులో స్థానం దొరకపోయినప్పటికీ ఐపీల్ సీజన్స్ ద్వారా సంజు అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే వస్తున్నాడు.
ఇక గత ఏడాది కెప్టెన్ గా తన సత్తా ఏంటో కూడా చూపించాడు. ఫైనల్ కి తన జట్టును చేర్చడం ద్వారా రన్నరప్ గా వెను తిరిగాడు. సంజు లాంటి ఆటగాలను టీమిండియా తొక్కేస్తుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏడాది ఎలాగైనా కప్పు కొట్టాలని కసి సంజు లో కనిపిస్తోంది ఆదివారం రోజు సన్ రైజర్స్ తో మొదటి ఆటలోనే అర్థ శతకం బాది తన జట్టును గెలిపించుకున్నాడు. 2018 నుంచి సన్ రైజర్స్ టీం తో మ్యాచ్ అంటే సంజు శాంసన్ విరుచుకు పడుతుంటాడు. ఇకనైనా సంజు కి భారత జట్టు లో స్థానం దొరకాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: