బంగ్లాదేశ్ క్రికెట్ హిస్టరీలో.. లిటన్ దాస్ అరుదైన రికార్డ్?

praveen
బంగ్లాదేశ్ జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న లిటన్ దాస్ ఇక క్రీజులో కుదురుకున్న తర్వాత సృష్టించే విధ్వంసం అంత ఇంతా కాదు అని చెప్పాలి. ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ బౌలర్ల పై పూర్తి ఆదిపత్యం చెలయిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అద్భుతమైన ఆట తీరుతో ఇక ఇటీవల కాలంలో ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం కొల్లగొట్టడం చేస్తూ ఉన్నాడు. లిటన్ దాస్ ఇక అతని ఆట తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మరోసారి లిటన్ దాస్ తన బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉంటుందో చూపించాడు.

 ఐర్లాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో ఏకంగా 18 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి ఒక అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు ఈ క్రికెటర్. ప్రస్తుతం ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్మెన్ లిటన్ దాస్ మరోసారి చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఏకంగా టి20 ఫార్మాట్లో బంగ్లాదేశ్ జట్టు తరఫున ఫాస్టెస్ట్ 50 చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇలా ఫాస్టెస్ట్ 50 సాధించిన అరుదైన రికార్డును అందుకున్నాడు.

 మొత్తంగా అతను బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి బౌలర్ల పై వీరవిహారం చేశాడు. 41 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లో సహాయంతో ఏకంగా 83 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అయితే గతంలో ఇలా బంగ్లాదేశ్ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికార్డు మహమ్మద్ ఆశ్రపుల్ పేరిట ఉండేది. కానీ ఇప్పుడు లిటన్ దాస్ దాన్ని బద్దలు కొట్టాడు అని చెప్పాలి. లిటిల్ దాస్  విజృంభించడంతో  బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక చివరికి ఐర్లాండ్ లక్ష్య చేదన ఓడిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: