
ఇదే నా చివరి టోర్ని కావచ్చు.. ఛాన్స్ వదులుకోను?
గత కొంతకాలం నుంచి కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే అవకాశం దక్కించుకుంటున్నాడు ఉమేష్ యాదవ్. అది కూడా అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం. ఇక వన్డేలతో పాటు టి20 ఫార్మాట్లో చోటు సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాడు. దాదాపు 12 ఏళ్ల క్రితం జాతీయ జట్టులోకి వచ్చిన అతను 56 టెస్టులు, 75 వన్డేలు ఆడాడు. ఇక టి20 ఫార్మాట్లో కేవలం 9 అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ లో మాత్రం 130కి పైగా మ్యాచ్లను ఆడటం గమనార్హం. ఇక ప్రస్తుతం కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎలాగైనా ఇక వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఉమేష్ యాదవ్. ఇక ఇదే తనకు చివరి ప్రపంచకప్ అవుతుందని.. తప్పకుండా జట్టులోకి వస్తానని చెప్పుకొచ్చాడు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఇక ఇదే నాకు చివరి టోర్నీ కావచ్చు. అందుకే జట్టులో చోటు సంపాదించాల్సిందే. ఉత్తమ ప్రదర్శన చేస్తే తప్పకుండా వన్డే ఫార్మాట్లో జట్టులో అవకాశం లభిస్తుందని నమ్ముతున్న. ఇంకో ఛాన్స్ కోసం మరో నాలుగేళ్లు వేచి చూడడం నావల్ల కాకపోవచ్చు అంటూ ఉమేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.