మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఇక కాసేపట్లో జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడనున్నాయి.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారణంగా మెగ్ లానింగ్ జట్టు ఫైనల్‌లో నేరుగా ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జుట్టు ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను ఓడించి ఫైనల్స్‌లో తమ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక అంతకుముందు లీగ్ దశలో ఇరు టీంలు రెండుసార్లు తలపడ్డాయి. ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది.ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇవాళ ఫైనల్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్‌కు ఓ ప్రత్యేక వీడియో ద్వారా తన విషెస్ ని తెలిపాడు.
ఇక డబ్ల్యూపీఎల్ ఫైనల్లో భాగంగా ముంబై ఇండియన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ సభ్యులందరూ కూడా హర్మన్ ప్రీత్ సేనకు తమ శుభాకాంక్షలు తెలిపారు.రోహిత్ మాట్లాడిన ప్రత్యేక వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. గత నాలుగు వారాలుగా మీ ఆట తీరు చాలా అద్భుతంగా ఉంది. వ్యక్తిగతంగా నేను మీ ఆటతీరును ఎంతగానో ఆస్వాదించాను. ఈరోజు జరుగబోయే ఫైనల్ చాలా కీలకం. ఆటను ఆస్వాదిస్తూనే బాగా ఎంజాయ్ చేయండి. నేటి ఫైనల్లో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి అంటూ ఎంఐ వుమెన్స్ టీమ్‌ను హిట్ మ్యాన్ బాగా ఎంకరేజ్ చేశాడు.ఇక బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రెయిట్ గా ఫైనల్‌కు చేరుకోగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ను ఓడించి చివరి పోరుకు అర్హత సాధించింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే గుజరాత్ జెయింట్స్ అయితే కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించాయి.