సూర్యతో సంజూని పోల్చొద్దు.. కపిల్ దేవ్ కామెంట్స్?

praveen
టి20 ఫార్మాట్ లో విధ్వంసకర ఆటగాడిగా పేరు సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్ అటు వన్డే  ఫార్మాట్లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున అతను ఆడిన ఏ వన్డే మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ  ప్రదర్శన చేయలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్లో అయితే అతను పూర్తిగా చేతులెత్తేసాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లలో కూడా డకౌట్ గా వెనుతిరిగాడు సూర్య కుమార్ యాదవ్.

 అయితే సూర్య కుమార్ ఇలా పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం సంజూ శాంసన్  పేరు తెరమీదకి వచ్చింది అని చెప్పాలి. సూర్య కుమార్ ని జట్టు నుంచి పీకేసి సంజూ ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలి అంటూ ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ కంటే వన్డే ఫార్మాట్లో సంజుకే మంచి గణాంకాలు ఉన్నాయి అంటూ చెబుతున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 గొప్పగా రాణించే ఆటగాడు ఎప్పుడు ఎక్కువ అవకాశాలను అందుకుంటాడు. సూర్య కుమార్ యాదవ్ తో సంజు  ను పోల్చవద్దు. అది సరైనది కాదు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ సంజు మంచి ప్రదర్శన చేయకపోతే మరో ఆటగాడి గురించి మాట్లాడుకుంటారు. జట్టు యాజమాన్యం సూర్యకు మద్దతుగా ఉండాలనుకుంటే అతనికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. సూర్యకుమార్ను ఏడో స్థానంలో పంపడానికి కారణం అతనికి మ్యాచ్ ముగించే ఫినిషర్గా అవకాశం ఇవ్వడమే. ఇది వన్డేల్లో కొత్తేం కాదు. చాలా సార్లు జరిగింది. టాప్ ఆర్డర్ ను  కిందకు లాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నేను టాప్ ఆర్డర్లో రాణించగలను అని చెప్పాల్సిన బాధ్యత ఆటగాడికే ఉంటుంది.  దీనిపై కోచ్, కెప్టెన్ ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కపిల్ దేవ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: