టీమిండియా ఓడిపోయినా.. రోహిత్ అరుదైన రికార్డు?

praveen
ఇటీవల సొంత గడ్డపై భారత జట్టుకు చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. అంతకుముందు టెస్ట్ సిరీస్ లో గెలిచి ఆధిపత్యాన్ని కనబరిచిన టీమ్ ఇండియా జట్టు అదే జోరును వన్డే సిరీస్ లో మాత్రం కొనసాగించలేకపోయింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. దీంతో గత నాలుగేళ్ల నుంచి స్వదేశంలో అన్ని ఫార్మట్లలో సిరీస్ లు గెలుస్తూ వస్తున్న టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది అని చెప్పాలి.

 ఇక టీమ్ ఇండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకోవడంతో అటు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో రోహిత్ అభిమానులు మాత్రం సంతోషంలో ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే భారత జట్టు ఓడిపోయినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో 10,000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఎనిమిదవ భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవలే మూడో వన్డే లో 30 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. దీంతో ఈ ఘనత సాధించాడు.

 రోహిత్ శర్మ ఇప్పుడు వరకు ఆసియాలో 10026 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే ఈ ఘనత సాధించిన వారిలో భారత క్రికెట్ దికజం సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఆసియాలో 21741 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార సంగకర 18423 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్ లిస్టు చూసుకుంటే..

1.సచిన్ టెండూల్కర్( 21741 పరుగులు)
2.కుమార సంగక్కర(18423 పరుగులు)
3.విరాట్ కోహ్లీ (14694 పరుగులు)
4.సనత్ జయసూర్య (13757 పరుగులు)
5.రాహుల్ ద్రవిడ్ (13497 పరుగులు)
6.వీరేంద్ర సెహ్వాగ్ (12155 పరుగులు)
7.యూనిస్ ఖాన్ (12073 పరుగులు)
8.ఇంజమామ్-ఉల్-హక్ (12070 పరుగులు)
9.దిల్షాన్ (11567 పరుగులు)
10.ఎంఎస్ ధోని (10840 పరుగులు)
11.సౌరవ్ గంగూలీ (10709 పరుగులు)
12.అరవింద డి సిల్వా (10589 పరుగులు)
13.మహ్మద్ అజారుద్దీన్ (10558 పరుగులు)
14.మహ్మద్‌ యూసఫ్‌(10059 పరుగులు)
15. రోహిత్‌ శర్మ(10026 పరుగులు)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: