14 ఏళ్ళ రికార్డులకు బ్రేక్.. 60 బంతుల్లో సెంచురీ?

praveen
తాజాగా బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఈ దేశాల మధ్య జరిగిన రెండో వన్డేలో 14 ఏళ్లుగా రికార్డులకు బ్రేకులు వేశాడు. బాంగ్లాదేశ్ కి చెందిన ముష్ఫికర్ రహీమ్ వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అయితే ఇతను సాధించిన ఆ ఫీట్ ఏంటంటే కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వన్ డే  ఫార్మాట్ లో ఇంత తక్కువ బాల్స్ కి సెంచరీ సాధించిన మొట్ట మొదటి బ్యాట్స్మెన్ గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ అనే మరొక బ్యాట్స్మెన్ పేరు మీద ఉంది. అతడు కేవలం 63 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డ్ సృష్టించగా ఈ రికార్డును ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్ తిరగ రాశాడు. జింబాబ్వే తో జరిగిన సిరీస్ లో 2009లోషకీబ్ ఈ ఫీట్ సాధించాడు. బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ సిరీస్ లో మరొక రికార్డును సైతం నెలకొల్పాడు రహీమ్. అది ఏంటంటే వన్డే ఫార్మాట్లో ఇప్పటికే 7000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా రహీం నిలిచాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో వన్ డే ఫార్మాట్ లో కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్ మాత్రమే 7000 పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ క్రికెట్ తరఫున తమీమ్‌ ఇక్బాల్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఫీట్ ని సాధించగా ఇప్పుడు వీరి సరసన  ముష్ఫికర్ రహీమ్ కూడా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ మధ్య జరిగిన రెండవ మ్యాచ్ విషయానికి వస్తే, బాంగ్లాదేశ్ విజయం సాధించగా ఐర్లాండ్ పై 50 ఓవర్లకు గాను 338 పరుగులు చేయగా ముష్ఫికర్ రహీమ్ 100 పరుగులతో స్టాండింగ్ లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండు పెద్ద రికార్డులకు వేదికగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: