WPL 2023: జెమీమా సూపర్ క్యాచ్.. నెట్టింట వైరల్?

Purushottham Vinay
ఇక మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా నిలకడగా రాణిస్తోంది. ఢిల్లీ టీం ఎట్టకేలకు సూపర్ గా ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఢిల్లీ బలమైన ప్రదర్శనలో యువ భారత బ్యాట్స్‌మెన్ అయిన జెమీమా రోడ్రిగ్స్ కూడా చాలా మంచి కీలక పాత్ర పోషించింది.ఇక డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌లో బాగా ఆడుతూ స్థిరంగా రాణిస్తోంది.అయితే జెమీమా తన బ్యాట్‌తో సత్తా చూపించడమే కాకుండా.. టోర్నీని చాలా ఆహ్లాదకరంగా మార్చి మైదానంలో తన డ్యాన్స్‌తో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.ఇంకా అలాగే వీటన్నింటితో పాటు, జెమీమా తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో చాలా భయాందోళనలు సృష్టిస్తోంది.ఇక ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టిన జెమీమా మళ్లీ అద్భుతమైన మరో క్యాచ్ పట్టి అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చింది.ఇక మార్చి 20 వ తేదీన, సోమవారం నాడు డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేకంగా, ఈ ఢిల్లీ ప్లేయర్ ఎంతో అద్భుతమైన డైవ్ చేయడం ద్వారా స్టన్నింగ్ క్యాచ్ ని తీసుకుంది. 


ఈ క్యాచ్ ముంబైపై ఒత్తిడిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.ఇక స్కోరు కేవలం 10 పరుగుల వద్ద ఉండగా, ముంబై ఫస్ట్ మూడు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది.ఇక నాల్గవ ఓవర్‌లో, మూడో బంతిని మిడ్-ఆన్‌లో ఆడేందుకు శిఖా పాండే చేసిన ప్రయత్నం అయితే అంతగా ఫలించలేదు. అక్కడ ఉన్న జెమీమా తన కుడివైపున కొన్ని అడుగులు పరిగెత్తుతూ లాంగ్ డైవ్ చేసి సూపర్ గా అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. ఈ క్యాచ్ చూసి అంతా కూడా దెబ్బకి షాక్ అయ్యారు.ఆ తర్వాత జెమీమా ఇక తన క్యాచింగ్‌లో తన ప్రతిభను కొనసాగించింది. బౌండరీ వద్ద ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ని ఆమె అందుకుంది. అదే సమయంలో ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ కి అమంజోత్ కౌర్‌ను రనౌట్ చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా ముంబైని కేవలం 109 పరుగులకే కట్టడి చేసేందుకు ఢిల్లీ బౌలర్లకు జెమీమా ఎంతగానో సహకరించింది.ప్రస్తుతం ఈమె అందుకున్న సూపర్ క్యాచ్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: