బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిచిన ఇండియా!

Purushottham Vinay
ఇండియా-ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా పూర్తయ్యింది. దీంతో మొత్తం 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది.అలాగే మరోవైపు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇండియా చేరింది.ఇంకా ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడుతుంది. నాలుగో టెస్టు, ఐదో రోజైన సోమవారం నాడు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కొనసాగింది. అయితే, మ్యాచ్ ముగిసేందుకు కొన్ని గంటలే సమయం ఉండటం, అలాగే మరో ఇన్నింగ్స్‌కు అవకాశం లేకపోవడం వల్ల మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో మ్యాచ్ ముగించాలని రెండు జట్ల కెప్టెన్లు నిర్ణయించారు. దీంతో మధ్యాహ్నం 03.20 గంటల సమయంలో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు కెప్టెన్లు ప్రకటించడం జరిగింది. ఇక ఈ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా, ఇండియా మొత్తం 571 పరుగులు చేసింది.ఇక మ్యాచ్ ముగిసే సమయానికి ఆసిస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175/2 స్కోరుతో ఉంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఖవాజా 180 పరుగులు ఇంకా కామెరూన్ గ్రీన్ 114 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ మొత్తం 128 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ మొత్తం 186 పరుగులు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియన్ బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు, షమి రెండు వికెట్లు తీశారు. ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 90 పరుగులు ఇంకా అలాగే మార్నస్ 63 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా 175 పరుగుల వద్ద మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.ఇక ఇదిలా ఉంటే శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సందేహాస్పదంగా ఉన్నాడు. అతనికి నడుము నొప్పి కారణంగా  చివరి టెస్టులో 4వ రోజు బ్యాటింగ్‌కు రాలేదు. అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లగా రిపోర్టులు సరిగ్గా లేవని తేలింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజూ శాంసన్ వన్డే టీం లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఫస్ట్ వన్డే జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయలేదు. ఇక ప్రస్తుతం అయ్యర్ స్థానంలో సంజు శాంసన్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: