నోరు మూసుకుని క్రికెట్ ఆడండి.. ఇండియాకు చాపెల్ వార్నింగ్?

praveen
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పోరు మరింత రసవతరంగా మారిపోయింది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్లలో కూడా స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా జట్టు మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తిస్తుంది. ఈ క్రమంలోనే రెండు టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోయిన కసి మొత్తాన్ని కూడా మూడో టెస్ట్ మ్యాచ్లో చూపించింది ఆస్ట్రేలియా జట్టు.


 ఈ క్రమంలోనే ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అటు భారత జట్టు ఆస్ట్రేలియా కు ఎక్కడ పోటీ ఇవ్వలేక తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ఏకంగా టీమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. నోరు మూసుకొని క్రికెట్ పైన దృష్టి పెట్టండి అంటూ కామెంట్స్ చేశాడు. పిచ్ లు ఎలా తయారు చేయాలో క్యూరేటర్లకు వదిలేస్తే బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా గత రెండు సిరీస్ లలో కూడా ఆస్ట్రేలియా వేదికగా జరిగినప్పుడు ఎలా గెలిచిందో మరిచిపోయారా.. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి గెలిచింది.


 కానీ ఇప్పుడు ఇండియాలో మ్యాచ్లు జరుగుతుంటే మాత్రం పిచ్ ల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది టీమిండియా. ఇక భారత జట్టుకు సూట్ అయ్యే పిచ్ లను తయారు చేస్తున్నారని ముందుగానే చెప్పాను. కానీ పిచ్ విషయం క్యూరేటర్లకు వదిలేస్తే బెటర్. ఎందుకంటే ఏది బాగుంటే అదే క్యూరేటర్ చేస్తాడు. ప్లేయర్స్ వాటిపై ఆడాలి అంటూ ఇయాన్ చాపెల్  చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత మ్యాచ్ లలో టీమిండియా తమకు అనుకూలంగా పిచ్ తయారు చేయమని అడిగితే మీ పని మీరు చూసుకోండి అని క్యూరీటర్ చెబుతాడని నేనైతే అనుకుంటున్నాను.  నోరు మూసుకొని క్రికెట్ పై దృష్టి సారించండి అంటూ ఇయాన్ చాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: