ద్యావుడా.. క్యాచ్ కోసం బట్టలు విప్పాలా మార్క్ ..!
ఎంత ప్రాక్టీస్ చేసిన కూడా కొన్ని సార్లు చాల మంచి ఆటగాళ్లు కూడా క్యాచ్ లను మిస్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాల విమర్శలకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తీవ్రమైన ప్రాక్టీస్ అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం బాంగ్లాదేశ్ తో వన్ డే మ్యాచులు ఆడుతున్న ఇంగ్లాడ్ టీమ్ క్యాచులు పట్టుకోవడం లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని కఠోరంగా శ్రమిస్తోంది. మరి ముఖ్యంగా దీనికి సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో మార్క్ వుడ్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాల్ ఆకాశం లో చాల పైకి ఎగిరింది. దాన్ని పట్టుకోవడానికి ముందుగా మార్క్ తన తలపైన ఉన్న టోపీ ని తీసేసాడు. ఆ తర్వాత తాను వేసుకున్న టి షార్ట్ మరియు షార్ట్ కూడా తీసాడు. చివరికి ఆ బాల్ ని చక్కగా పట్టుకున్నాడు.
ఇక ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే క్యాచ్ పట్టుకోవడం కోసం మార్క్ తన బట్టలను ఎందుకు విప్పాడా అని ? అయితే తెలుస్తున్న విషయం ప్రకారం ఏకాగ్రత పెంచుకోవడం కోసం ఇలా బట్టలు విప్పుతూ కూడా బాల్ ని గమనించడం కోసం ఇలా చేసాడట. ఈ విషయం తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఒక క్యాచ్ కోసం ఇంత కష్టపడితే మ్యాచ్ కోసం ఆటగాళ్లు ఎంత కష్టపడతారో అర్ధం చేసుకోవాల్సిదే.