టీమిండియాను దెబ్బకొట్టిన లియోన్.. అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక దీనికోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇందులో భాగంగానే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో భారత జట్టు ఘనవిజయాన్ని సాధించింది. స్వదేశీ పరిస్థితులను ఎంతో అద్భుతంగా వినియోగించుకుని విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే భారత స్పిన్నర్లు ఎంతో అద్భుతంగా రానించి అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు ముచ్చెమటలు  పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించారు.



 అదే సమయంలో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్   లాంటి వాళ్లు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే వైఫల్యం కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ భారత పిచ్ లపై నాథన్ లియోన్ తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసేసాడు. స్వదేశీ పరిస్థితులను వినియోగించుకుంటున్న భారత జట్టును తన స్పిన్ బౌలింగ్ తో కోలుకోలేని దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. అతని బౌలింగ్ లోనే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా జట్టు. అది కూడా వరుసగా బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టడం  గమనార్హం.


 అయితే ఇక ఇలా రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నాథన్ లియోన్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100 వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియన్ బౌలర్గా నిలిచాడు నాథన్ లియోన్. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు అని చెప్పాలి. అంతకుముందు అనిల్ కుంబ్లే 111, అశ్విన్ 100 వికెట్లతో తొలి రెండు స్థానంలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో నాథన్ లియోన్ మొత్తంగా ఐదు వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ప్లేయర్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: