
గెలుస్తుందనుకుంటే.. టీమిండియా ఇలా ఓడిపోయిందేంటి?
కాగా సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమిండియా మహిళలు జట్టు మంచి ప్రదర్శనతో సత్తా చాటుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ ను కూడా చిత్తు చేసి వరుసగా రెండు విజయాలు సాధించింది. అయితే ఇక ఇటీవలే ఇంగ్లాండ్తో మూడో మ్యాచ్ ఆడింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత జట్టు ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా సెమీఫైనల్ లో అడుగు పెట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
అప్పటికే వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న టీం ఇండియా జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. కానీ పటిష్టమైన ఇంగ్లాండును మాత్రం ఓడించలేకపోయింది అని చెప్పాలి. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో 11 పరుగులు తేడాతో ఓటమిపాలు అయింది. ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనలో ఒకానొక సమయంలో టీమిండియా మహిళల జట్టు తడబడింది అని చెప్పాలి. స్మృతి మందాన 52, రిచా ఘోష్ 47 పరుగులతో రాణించినప్పటికీ విజయం అందించలేకపోయారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది టీమిండియా.