
షాకింగ్ : బిసిసిఐ చీఫ్ సెలెక్టర్.. చేతన్ శర్మ రాజీనామా?
అయితే మరోసారి చేతన్ శర్మ కే చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. దీంతో బీసీసీఐ కాస్త విమర్శలు కూడా ఎదుర్కొంది ఇంతదానికే పాత సెలక్షన్ కమిటీని రద్దు చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ కొంతమంది పెదవి విరిచారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న భారత చీఫ్ సెలెక్ట్ చేతన్ శర్మ బిసిసిఐ గురించి.. ఇక భారత క్రికెట్లో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా చేతన శర్మ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్ల కెరియర్ ని దెబ్బతీసేలా ఉన్నాయి అని చెప్పాలి. ఇక చేతన్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అతనిపై బీసీసీఐ వేటు వేయడం ఖాయమని అందరూ భావించారు.
అయితే అంతకుముందు గానే చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇటీవలే రాజీనామా చేశాడు అనేది తెలుస్తుంది అయితే తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపించాడు చేతన్ శర్మ. ఇక జైషా కూడా ఈ రాజీనామాను ఆమోదించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇలా బీసీసీఐలో రోజులు ఇలాంటి ఘటనలు జరగడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఎందుకంటే బీసీసీఐ ఏరి కోరి మరి చేతన్ శర్మకే సెలక్షన్ కమిటీ బాధ్యతలను అప్పగించింది. కానీ ఇక ఇప్పుడు అతను రాజీనామా చేయడంతో అసలు ఏం జరిగిందో కూడా తెలియక కన్ఫ్యూషన్ లో పడిపోతున్నారు టీమ్ ఇండియా అభిమానులు.