నేనేం ఫీల్ కావట్లేదు.. రిటైర్మెంట్ పై మిథాలీ రాజ్?

praveen
భారత మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ ఎంత లెజెండరీ క్రికెటర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 22 ఏళ్లకు పైగానే ఇక భారత జట్టులో సేవలు అందించిన మిథాలీ  రాజ్ భారత జట్టుకు కెప్టెన్ గా  ఎన్నో అరుదైన విజయాలను కూడా అందించింది అని చెప్పాలీ. ఏకంగా ప్రపంచ క్రికెట్లో భారత మహిళల జట్టును అగ్రస్థానంలో నిలపడంలో అటు మిథాలీ రాజ్ కీలక పాత్ర పోషించింది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే మిథాలీ రాజ్ మరికొన్నెళ్ల పాటు అటు టికెట్లో కొనసాగుతుందనుకున్నప్పటికీ ఇక రిటైర్మెంట్ ప్రకటించింది.


 ఇక మిథాలీ రాజ్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియా మహిళల జట్టు సారథి బాధ్యతలను చేపట్టి ఇక జట్టును ముందుకు నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే మిథాలీ రాజ్ ఇలా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఇక ఎన్నో రోజులుగా మహిళా క్రికెటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇక ఈ లీగ్ కి సంబంధించి ఇటీవల జరిగిన వేలంలో ఎంతమంది ప్లేయర్లు కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉంటే మిథాలీ రాజ్ కూడా కోట్ల రూపాయలు దక్కించుకునేది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించినందుకు బాధపడుతూ ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినందుకు తాను బాధపడట్లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ మాజీ కెప్టెన్. తన కెరీర్లో ప్రతి దశను ఆస్వాదించానని సరైన సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకున్నాను అంటూ తెలిపింది. కాగా మిథాలీ రాజ్ 12 టెస్టులు 232 వన్డేలు, 99 టి20 లు ఆడింది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  గుజరాత్ జట్టుకు మెంటర్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: