చెలరేగిన మయాంక్.. డబుల్ సెంచరీ బాదేశాడుగా?
ఇలా స్టార్ ప్లేయర్గా ఎదిగిన మయాంక్ అగర్వాల్ ఆ తర్వాత మాత్రం నిలకడలేమిటో ఇబ్బంది పడ్డాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఇక జట్టు ఎంపికలో అతని మాత్రం సెలెక్టరు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇక భారత జట్టుకు దూరమైన నేపథ్యంలో అతను రంజీ ట్రోఫీలో ఆడుతూ ఉన్నాడు. గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కర్ణాటక జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ ఏకంగా జట్టు సారధ్య బాధ్యతలు అందుకొని టీం ని ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా జరిగిన ఒక మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఇలా ద్విశతకంతో చెలరేగిపోయాడు. 429 బంతులను ఎదుర్కొన్న మయాంక్ ఆరు సిక్సర్లు 18 ఫోర్లతో 249 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు 112 పరుగులకే కర్ణాటక జట్టు ఐదు వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ కి వచ్చిన మయాంక్ ఆ తరువాత తన ఆట తీరుతో జట్టును ఆదుకున్నాడు.