కోహ్లీ సెంచరీలు చేస్తుంటే.. పాక్ మాజీ ఇలా అన్నాడేంటి?

praveen
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ మొదటి వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను కలుగొట్టాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక ఫార్మట్ తో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ  సృష్టించిన విధ్వంసం గురించి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎవరు కూడా అంత సులభంగా మరిచిపోరు అని చెప్పాలి.

 అయితే ప్రతి ఆటగాడు కెరీర్లో గడ్డు పరిస్థితులు సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. అయితే అత్యుత్తమ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీ కెరియర్ లో కూడా ఇక ఇలాంటి గడ్డ పరిస్థితులు ఎదుర్కొన్నాడు   దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతను క్రికెట్కు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఎంతో మంది అతన్ని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ మాత్రం గడ్డు పరిస్థితుల నుంచి బయటికి వచ్చి ఇక మళ్ళీ తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి.

 ఆసియా కప్ లో భాగంగా ఇక సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని నిరూపించిన కోహ్లీ ఇప్పటికీ కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తూ అదరగొడుతున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో మళ్లీ ప్రపంచ రికార్డులను కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మాత్రం విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ లో లేడు అంటూ వ్యాఖ్యానించాడు. అతడి నుంచి అత్యుత్తమమైన ఫామ్ ఇంకా బయటికి రావాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకార లాగా విరాట్ కోహ్లీ రోజు రోజుకి క్రికెట్లో రాటు తేలుతున్నాడు అంటూ సల్మాన్ బట్ వ్యాఖ్యానించాడు. అత్యుత్తమ ఫామ్ లోకి రావాలంటే కోహ్లీ తన ఆట తీరులో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: