క్రికెట్ హిస్టరీలో.. జింబాబ్వే క్రికెటర్ అరుదైన రికార్డ్?

praveen
అప్పుడప్పుడు ప్రపంచ క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లకు సంబంధించిన వార్తలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సదరు ఆటగాళ్లు కేవలం ఒక దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ జట్టులో క్రికెట్ ఆడటం కాదు ఏకంగా రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడి అరుదైన రికార్డులు క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ కూడా ఇలాంటి అత్యంత అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి.

 ఇప్పుడు వరకు గ్యారీ బ్యాలెన్స్ ఇంగ్లాండ్, జింబాబ్వే తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాడు. అయితే ఈ ఘనత సాధించిన 16వ క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇక మరోవైపు ఇంకో ఆసక్తికర రికార్డును కూడా సాధించాడు. తొలుత ఇక సొంత దేశం అయినా జింబాబ్వే తరపున కాకుండా పరాయి దేశం అయిన ఇంగ్లాండు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి ప్లేయర్ గా ఒక చరిత్ర సృష్టించాడు. ఇలా ఒక క్రికెటర్ తొలుత ఇతర దేశానికి ఆ తర్వాత సొంత దేశానికి ఆడటం క్రికెట్ హిస్టరీలో ఇదే మొదటిసారి అని చెప్పాలి.
 అయితే ఇప్పుడు వరకు ఇలా రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన వాళ్ళు 15 మంది ఉన్నారు. కానీ వారందరూ కూడా మొదట సొంత దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడి ఇక ఆ తర్వాత పరాయి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం గ్యారి బాలన్స్ అందుకు విభిన్నంగా ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కాగా గ్యారి బాలన్స్ పుట్టి పెరిగి విద్యను అభ్యసించింది జింబాబ్వే లోనే. 2016లో తన తాత ముత్తాతల దేశమైన బ్రిటన్ కి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఈ క్రమంలోని ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న అతడు కౌంటిల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లాండ్ జాతీయ జట్టులోకి వచ్చాడు. నాలుగేళ్లపాటు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
 ఇక ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు తర్వాత అవకాశాలు రాలేదు. మళ్ళీ సొంత గూడు అయినా జింబాబ్వేకి వచ్చి ఇటీవల ఫిబ్రవరి 4వ తేదీన మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా జింబాబ్వే తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు 33 ఏళ్ల గారి బ్యాలెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: