పాపం.. పాక్ మాజీకి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది?

praveen
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ , భారత్ మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగానే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కడ లేనంత ఉత్కంఠ ఉంటుంది. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కన్నారపకుండా మ్యాచ్ వీక్షించడం చేస్తూ ఉంటారు. ఇక అలాంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరిగితే చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంటే.. ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు.

 ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టీమ్ ఇండియా ఓటమి ఖాయం అనుకుంటున్న సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా 19 ఓవర్లో హరీష్ రావుఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అయితే క్రికెట్ హిస్టరీలోనే స్పెషల్ షాట్స్ గా మిగిలిపోయాయి అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభివర్ణించారు. ముఖ్యంగా ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రైట్ సిక్సర్ అయితే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను  చేసింది అని చెప్పాలి.

 ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్ గురించి ఇటీవల పాకిస్తాన్ మాజీ ఆటగాడు సోహైల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ స్ట్రైట్ సిక్సర్ కొట్టాడు.. హరీష్ రవుఫ్ బౌలింగ్ లో ఈ షాట్ సాధించాడు. అయితే తొలుత తాను ఈ షాట్ ని షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో కొట్టాడేమో అని బ్రమపడ్డాను అంటూ సోహైల్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అయితే వరల్డ్ కబ్ ముగిసిన ఇన్ని రోజుల తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యిందా అంటూ ఇక సోహైల్ ఖాన్ ను ఎంతో మంది నేటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: