టీమిండియా vs ఆస్ట్రేలియా.. మ్యాచ్ చూసేందుకు స్వయంగా ఆయనే వస్తున్నారట?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. ఇక ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే ఇక ఈ సిరీస్ లో విజయం సాధించడం భారత్ కు తప్పనిసరి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే గతంలో టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఇక సొంతగడ్డపైనే ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఇక ఇప్పుడు భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా అదే రీతిలో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి.
అయితే ఇప్పుడు వరకు టీమిండియా జయాపజయాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లలో ధైర్యం నింపుతూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు ప్రధాని మోడీ స్వయంగా టీమిండియా మ్యాచ్ చూడేందుకు కదలి రాబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ అయినా నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చ్ 9వ తేదీన జరగబోతుంది.అయితే ఈ మ్యాచ్ కి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని అంతోని ఆల్బరీస్ హాజరవుతారట. ఇక చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.