వైరల్: క్రికెటర్ గ్రౌండ్ అవతలకి కొట్టిన బంతిని పట్టుకొని పారిపోయిన ఓ అభిమాని?

praveen
!
అబుదాబి సాక్షిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ t20 టోర్నమెంట్లో ఇంతకు ముందెన్నడూ చూడని దృశ్యం ఆవిష్కృతం అయింది. ఓ రకంగా దీనిని ఒక హాస్యాస్పద సన్నివేశంగా పరిగణించొచ్చు. అవును, బ్యాటర్ బంతిని బలంగా కొట్టడంతో అది స్టేడియం అవతలకి వెళ్లి పడింది. స్టేడియం బయట ఉన్న వ్యక్తి దానిని పట్టుకొని కొన్ని సెకెన్లు పాటు బంతిని చూసి అక్కడినుంచి బంతిని తీసుకొని ఉడాయించాడు. దాంతో బంతిని తిరిగి ఇస్తాడనుకొని ఎదురు చూసిన ప్లేయర్స్ కి నిరాశే ఎదురయ్యింది.
MAI ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ అవతలకి స్పీడుగా కొట్టాడు. దాంతో బంతి నేరుగా వెళ్లి బ్రిడ్జి పైన పడింది. అక్కడికి ప్లేయర్స్ వెళ్లి ఆ బంతిని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇదే క్రమంలో అక్కడినుండి క్రీడను తిలకిస్తున్న ఓ క్రికెట్ అభిమాని ఆ బంతిని పట్టుకోవడంతో దానిని విసరకపోతాడా అని ఎదురు చూసారు. కానీ వారి ఆశ నిరాశే అయింది?
దాంతో వారు ఇక చేసేదేమి లేక వేరొక బంతితో ఆటని కొనసాగించారు. ఆ వీడియోని ఒకసారి గమనిస్తే, సదరు బంతిని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకొని బంతితో అక్కడి నుంచి మెల్లగా జారుకోవడం స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ సరదా దొంగతనం తాలూకా ఫుటేజ్ ట్విట్టర్ లో షేర్ అవుతోంది. ఇక ఆ తర్వాత కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొత్తగా ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. అయితే ఇపుడు మనోడికి అవకాశం ఇవ్వకుండా ప్లేయర్లే వెళ్లి ఆ బంతిని తెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి 20 తన ట్విటర్లో షేర్ చేస్తూ.... సిక్సర్ల వర్షం కురుస్తోంది, మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్? బంతిని తీసుకొని పారిపోతారా? లేదంటే బంతిని తిరిగి ఇచ్చేస్తారా? మీరే ఎంపిక చేసుకొండి! అంటూ కామెంట్ చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: