జట్టులో అతనొక మెజీషియన్.. అందుకే గెలిచాం : రోహిత్

praveen
సొంత గడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్న టీమిండియా జట్టు తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే మాకు లెక్కలేదు అన్న విధంగానే చిత్తుగా ఓడిస్తూ వరుసగా సిరీస్లలో విజయం సాధిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోని ఇక టీమిండియా పర్యటనకు రావాలి అంటేనే అటు ప్రత్యర్థులు భయపడే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్తో కూడా వన్డే సిరీస్ ను గెలుచుకుంది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకుంది టీం ఇండియా.

 ఇక ఆ తర్వాత మూడో మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీట్ చేస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే 90 పరుగులు తేడాతో న్యూజిలాండ్ చిత్తుగా ఓడించి మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించింది. ఈ క్రమంలోనే మరోసారి సొంత గడ్డపై తమ ఆధిపత్యాన్ని చలాయించింది అని చెప్పాలి. ఇకపోతే మ్యాచ్ అనంతరం తమ విజయం పై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా రెండు సిరీస్ లను క్లీన్స్వీప్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నిలకడగా రాణించడంతోనే వరుసగా 6 మ్యాచ్లలో విజయం సాధించగలిగా అంటూ తెలిపాడు.

 జట్టులో ఆల్రౌండర్ గా కొనసాగుతున్న శార్దూల్  ఠాగూర్ ఒక మెజీషియన్ అంటూ ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇక అతనికి జట్టులో మెజీషియన్ అనే పేరు ఉన్నట్లుగానే జట్టుకు అవసరమైనప్పుడల్లా బంతి బ్యాట్ తో రాణిస్తున్నాడు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక మూడవ వన్డే మ్యాచ్లో సెంచరీ చేయడం తన ఆనందాన్ని రెట్టింపు చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. మేము వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే ఆరు మ్యాచ్ లలో విజయం సాధించాము అంటూ తెలిపాడు. ఇక బౌలర్లు బ్యాట్స్మెన్లు అద్భుతంగా రానించి సత్తా చాటారు అంటూ ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: