ఒత్తిడి అంటే.. నాకు ఎంతో ఇష్టం : అశ్విన్
ప్రస్తుతం భారత జట్టులో ఎంతమంది స్పిన్నర్లు ఉన్నప్పటికీ అటు రవిచంద్రన్ అశ్విన్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక వైపు తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు మ్యాజిక్ చేస్తూ వికెట్లు పడగొట్టడమే కాదు జట్టుకు అవసరమైన సమయంలో ఇటీవల కాలంలో బ్యాట్ కూడా జలుపిస్తూ ఉన్నాడు. ఏకంగా అశ్విన్ కెరియర్లో ఐదు టెస్టు సెంచరీలు ఉన్నాయి అంటే అతను ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి.
ఇకపోతే తన కెరీర్ గురించి ఇటీవలే అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని ఉత్తమంగా సాధించాలి అంటూ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక ఏ రంగంలో అయినా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి అంటూ సూచించాడు. సాధారణంగానే భారత్ తరపున ఆడుతున్నాము అంటే చాలా అంచనాలు ఆకాంక్షలు ఉంటాయి అన్న విషయం మాకు తెలుసు. అయితే వాటికి తగ్గట్లుగానే ప్రదర్శన చేయాలని అంటూ యువ క్రికెటర్లు అందరికీ కూడా రవిచంద్రన్ అశ్విన్ సూచన చేశాడు. అయితే ప్రతి మ్యాచ్ లో కూడా ఒత్తిడి కోసం తాను ఎదురు చూస్తూ ఉంటానని ఎందుకంటే ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రతి మ్యాచ్ కూడా తనకు పెద్ద మ్యాచ్ లాంటిదే అంటూ తెలిపాడు.