ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు.. స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఒకే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. హార్దిక్ పాండ్యా తర్వాత ఇక టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే టి20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అటు ఐపీఎల్ లో కెప్టెన్ గా సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యా ఇక టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్గా కూడా వరుస విజయాలు సాధిస్తున్నాడని.. అతనిలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అతనికి.. సారధ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు.

 కేవలం క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అన్న చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై ఇటీవల అటు రోహిత్ శర్మకు కూడా ప్రశ్న ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోని టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ.

 టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా.. భవిష్యత్తు కెప్టెన్ గురించి ఇప్పుడే చెప్పడం సరైనది కాదు. ప్రస్తుతం మనం వరల్డ్ కప్ సంవత్సరంలో ఉన్నాము. నా దృష్టి అంతా ఇక వరల్డ్ కప్ మీదే ఉంది. అంతే కాకుండా ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అందుకే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక నేను టి20 లను వదిలేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదు. వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని కొందరికి మూడు ఫార్మాట్లకు ఆడటం కుదరకపోవచ్చు. వరుసగా షెడ్యూల్ ఉన్న నేపథంలో వర్క్ లోడ్ తగ్గించడానికి విరామం ఇవ్వాల్సి ఉంటుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: